ఇంటికి పరిమితమై ఉపాధి లేక.. తిండికి ఇబ్బంది పడుతున్న రోజువారి కూలీల సమస్యలకు లాక్డౌన్ ముగిసే వరకు శాశ్వత పరిష్కారం చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. బతుకుదెరువు కోసం రాష్ట్రాలు దాటి వస్తున్న వలస కూలీలు కూడా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్యాంపులు ఏర్పాటు చేసి వారందరిని పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ముఖ్యమంత్రి పెడచెవిన పెడుతున్నారని ఆయన విమర్శించారు.
స్వచ్ఛంద సంస్థలు వలస కూలీలకు అన్నదానం చేస్తుంటే.. పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికులు గత్యంతరం లేక సొంత గ్రామాలకు వెళ్లిపోతుంటే పోలీసులు వారిని ఇక్కడే ఉండాలంటూ బలవంతంగా వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. సరైన వసతి లేకపోతే ఎవరైనా ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకొని రోజువారి కూలీలు, వలస కార్మికుల విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఇదీ చూడండి: పింఛన్దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?