ETV Bharat / city

గుర్రంబోడు భూ కబ్జాలకు తెరాసయే కారణం: ఉత్తమ్​

గుర్రంబోడు భూముల వ్యవహారంలో బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్​రెడ్డి ఖండించారు. సీఎం కేసీఆర్​కు తాను అనుకూలం అనే వ్యాఖ్యలను వ్యతిరేకించారు. అధికారపక్షం అండదండలతోనే పలువురు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

uttam kumar reddy
ఉత్తమ్‌ కుమార్​రెడ్డి
author img

By

Published : Feb 8, 2021, 2:16 PM IST

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారానికి అధికారపక్షం భూ కబ్జాలే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో భూ దందా నడుస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగంతో ఎన్ని సార్లు మాట్లాడినా స్పందన లేదన్నారు.

భూ ఆక్రమణలపై అధికారులకు వందలసార్లు ఫిర్యాదు చేశానని.. ఇద్దరు తహసీల్దార్లను గతంలో సస్పెండ్​ చేశారని ఉత్తమ్​ వెల్లడించారు. మఠంపల్లి మండలం 540 సర్వే నంబరు సహా.. హుజూర్‌నగర్ పురపాలక భూ కబ్జాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

గుర్రంబోడు భూ కబ్జాలకు తెరాసయే కారణం: ఉత్తమ్​

ఇదీ చదవండి: కబ్జాదారులకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారు : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.