ETV Bharat / city

"పోలవరం నిర్మాణ పనుల నుంచి తప్పుకోండి"

పోలవరం నిర్మాణం నుంచి తప్పుకోవాలంటూ నవయుగ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టులపై ఏర్పాటైన నిపుణుల సూచనల మేరకు.. నిబంధనలను అనుసరించి టెండర్లను ప్రీ క్లోజర్ చేస్తున్నట్టుగా నోటీసుల్లో తెలిపింది.

"పోలవరం నిర్మాణ పనుల నుంచి తప్పుకోండి"
author img

By

Published : Aug 1, 2019, 10:49 PM IST

ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత కాంట్రాక్టరు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్​ను తప్పుకోమంటూ ప్రీక్లోజర్ నోటీసు జారీ చేసింది. 60 సీ నిబంధన ప్రకారం పాత కాంట్రాక్టరును తప్పిస్తూ నామినేషన్ ప్రాతిపదికన పనులు కేటాయించటంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ప్రీక్లోజర్ నోటీసు జారీ చేస్తున్నట్టు జలవనరుల శాఖ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు సుధాకర్ బాబు పేరిట ఈ నోటీసులు నవయుగ సంస్థకు జారీ అయ్యాయి.

స్పిల్ వేలో క్రస్ట్ లెవల్ పనులు, స్పిల్ ఛానల్ పనులకు గానూ రూ.1244.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని పోలవరం చీఫ్ ఇంజినీర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు రూ. 918 కోట్లు, కాఫర్ డ్యామ్​లు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్ ఛానల్ పనుల కోసం మరో 751 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చిన ఈ పనుల్ని ఒప్పందంలోని 89.3 నియమావళి కింద ప్రీక్లోజర్ చేయాలని నిర్ణయించినట్టు పోలవరం చీఫ్ ఇంజినీర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు 60 సి ప్రకారం నామినేషన్ ప్రాతిపదికన ఈ పనుల్ని గత ప్రభుత్వం అప్పగించింది.

ప్రత్యేక రివాల్వింగ్ ఫండ్ ద్వారా డీజీల్​తోపాటు ఉక్కు, సిమెంటు కోనుగోళ్లపై కూడా నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా నామినేషన్ విధానంలో కేటాయించిన ఈ పనుల్ని రద్దు చేస్తూ తాజాగా మళ్లీ టెండర్లను జారీ చేయాలని భావిస్తున్నామని.. మ్యూచువల్ కన్సెంట్ ప్రాతిపదికన నవయుగ సంస్థ ఎదుర్కోనున్న నష్టాన్ని చెల్లింపు చేసేవిధంగా 15 రోజుల్లోగా తమను సంప్రదించాలంటూ జలవనరుల శాఖ సదరు నోటీసుల్లో స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: 'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

New Delhi, Aug 01 (ANI): Popular apps including Snapchat, Facebook and YouTube may come under fire if the US government agrees to pass a bill that seeks to ban apps exploiting human psychology.According to The Guardian, the Social Media Addiction Reduction Technology (Smart) Act is a proposed bill that targets techniques and features which encourage and deepen addictive behaviours.It specifically seeks to prohibit practices including infinite scrolling as seen on Facebook newsfeed, autoplay videos such as those on YouTube, and badges or awards linked to engagement such as Snapstreaks.Republican Senator Josh Hawley who has proposed the bill argues that the companies behind such apps are using psychological tricks to keep users hooked.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.