ETV Bharat / city

ఈ నెల 15, 16 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్​ యూనియన్స్ సమ్మె - యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్​ యూనియన్స్ సమ్మె

కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15, 16 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్​ యూనియన్స్ సమ్మెకు దిగనున్నారు. విధ డిమాండ్ల సాధనకు మద్దతు పలకాలని ఉపసభాపతి పద్మారావుగౌడ్​కు యూనియన్​ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

united forum of banks strike on march 15th and 16th

author img

By

Published : Mar 6, 2021, 7:46 PM IST

కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మారావు గౌడ్​తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్​ యూనియన్స్ తెలంగాణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.

కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15, 16 తేదీల్లో సమ్మెను చేపట్టనున్నామని ప్రతినిధులు తెలిపారు. వివిధ డిమాండ్ల సాధనకు మద్దతు పలకాలని పద్మారావుగౌడ్​కు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు సిబ్బంది డిమాండ్లపై తాము సానుకూలంగా ఉన్నామని... తమ పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సంఘం నేతలు ఆర్ శ్రీరామ్, వెంకట రామయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.