ETV Bharat / city

యోగాతో మనిషి ఆరోగ్యంగా జీవించొచ్చు: కిషన్​రెడ్డి - కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్​

Kishan Reddy: మనిషి ఆరోగ్యంగా జీవించడానికి... యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇవాళ నిర్వహించనున్న యోగా ఉత్సవ ఏర్పాట్లను... మరో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి కిషన్‌రెడ్డి పరిశీలించారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By

Published : May 27, 2022, 2:49 AM IST

Kishan Reddy: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ నిర్వహించనున్న యోగ ఉత్సవ ఏర్పాట్లను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్​ పరిశీలించారు. వచ్చే నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని... పెద్ద ఎత్తున జరపనున్నట్లు మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగే... యోగా కార్యక్రమంలో హైదరాబాద్‌ ప్రజలు భారీగా పాల్గొనాలని కిషన్‌రెడ్డి కోరారు.

మనిషి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని... దేశంలో వివిధ ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 75 ప్రముఖ ప్రాంతాల్లో యోగా డే నిర్వహించబోతున్నామని... క్రీడాకారులు, నటులు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:Modi in Hyderabad: 'తెలంగాణలో అడుగుపెట్టగానే ఆ విషయం అర్థమైంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.