ETV Bharat / city

పాఠశాల స్థాయిలోనే ఎదుటివారి పట్ల దయను కలిగి ఉండేలా నేర్పించాలి: కిషన్ రెడ్డి

author img

By

Published : Mar 13, 2022, 8:07 PM IST

Central minister kishan reddy: పాఠశాల విద్య స్థాయిలోనే చిన్నారులకు ఎదుటి వారి పట్ల దయను కలిగి ఉండాల్సిన అవసరాన్ని నేర్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి ముందు త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ, యునెస్కో సంయుక్తంగా కన్హ శాంతి వనంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు.

kishan reddy
మంత్రి కిషన్ రెడ్డి

Central minister kishan reddy: దయకలిగి ఉండటం మానవ లక్షణం అనే అంశంపై హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, యునెస్కో సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఎస్సే రైటింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి కన్హ శాంతి వనంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై విజేతలకు అవార్డ్స్ అందించి మాట్లాడారు.

kishan reddy
పాఠశాల స్థాయిలోనే ఎదుటివారి పట్ల దయను కలిగి ఉండేలా నేర్పించాలి: కిషన్ రెడ్డి

'రామచంద్ర మిషన్ సంస్థ ప్రజలలో అనేక రకాలైన మార్పులు తీసుకువస్తోంది. ఆధ్యాత్మికమైన, సామాజిక పరమైన, ఆర్థికపరమైన భావాలను ప్రజలలో పెంపొందిస్తుంది. యోగా, మెడిటేషన్, సమాజంలో క్రైమ్ ఎలా తగ్గించుకోవాలి, ప్రజలలో సోదరభావాన్ని ఎలా పెంపొందించుకోవాలనే లాంటి అద్భుతమైన కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది. వచ్చే 25 ఏళ్లు మనకు అమృత కాలం. ఈ మధ్య కాలం దేశ అభివృద్ధికి అత్యంత కీలకం. వచ్చే ఆగస్టు 15న ప్రతి ఇంటి ముందు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలి. పాఠశాల విద్య స్థాయిలోనే చిన్నారులకు ఎదుటి వారి పట్ల దయను కలిగి ఉండాల్సిన అవసరాన్ని నేర్పించాలి.'

-కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

ఈ సందర్భంగా మాట్లాడిన నటి కృతిశెట్టి మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్​ నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పాటిల్, డైరెక్టర్ లింగుస్వామి, యునెస్కో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్​మెంట్ సంస్థ డైరెక్టర్ అనంత దురయప్ప సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపటి నుంచి మాజీ ఎంపీ సర్వోదయ పాదయాత్ర.. పాల్గొననున్న రాహుల్​ గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.