ETV Bharat / city

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని సంవత్సరం పాటు గుర్తుచేసుకుందాం: కిషన్‌రెడ్డి

kishan reddy on Chakali Ailamma: తెలంగాణ విమోచనానికి కృషి చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ట్యాంక్​బండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంవత్సరం పాటు ఈమె ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు.

central minister kishan reddy
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
author img

By

Published : Sep 10, 2022, 6:40 PM IST

kishan reddy on Chakali Ailamma: నిజాం నియంతృత్వ పాలనకు ఈ నెల 17వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తి చేసుకొని 75 ఏళ్ల వడిలోకి అడుగుపెడుతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలను సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విమోచనానికి ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్​బండ్‌లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే ముఠాగోపాల్​తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని సంవత్సరం పాటు గుర్తు చేసుకుందామన్నారు. హైదరాబాద్ విమోచన ఉత్సవాలను ఈ ఏడాది సెప్టెంబర్ 17 తేదీ నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో సంవత్సరం పాటు వైభవంగా భారత ప్రభుత్వం తరఫున నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

నాడు చాకలి ఐలమ్మ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిజాం ఏజెంట్లకు, సామంతులకు, సంస్థానాలకు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా నిర్మాణాత్మక పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఆమె చేసిన పోరాటం మహిళా లోకానికే మార్గదర్శకం అన్నారు. ఆమెలాగే ఎంతో మంది మహనీయులు ఈ భారత స్వాతంత్య్రం, తెలంగాణ విమోచనకు కృషి చేశారని వారందరినీ స్మరించుకుందామన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాటయోధురాళ్ల స్ఫూర్తిని సంవత్సరం పాటు గుర్తు చేసుకుంటూ, సంబురాలు చేసుకుందామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.