ETV Bharat / city

ధైర్యముంటే ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ బయ్యారం పూర్తి చేయాలి: కిషన్​రెడ్డి - కేసీఆర్​ పై కిషన్​రెడ్డి మండిపాటు

Kishan Reddy on Bayyaram Steel Factory: బయ్యారంలో నాణ్యమైన ముడి ఇనుము లేదని ఎనిమిదేళ్ల క్రితమే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా గతంలో పార్లమెంటులో చెప్పారనీ.. అయినా స్వార్ధ రాజకీయాల కోసం తెరాస ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న కేసీఆర్.. ముందు స్వరాష్ట్రంలో ప్రజల పరిస్థితిని గుర్తించాలని సూచించారు.

KIshan Reddy
KIshan Reddy
author img

By

Published : Sep 30, 2022, 8:40 PM IST

ధైర్యముంటే ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ బయ్యారం పూర్తి చేయాలి: కిషన్​రెడ్డి

Kishan Reddy on Bayyaram Steel Factory: బయ్యారంలో నాణ్యమైన ముడిఖనిజం లేదని స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా- సెయిల్‌.. నివేదిక ఇచ్చిందనీ.. అక్కడ పరిశ్రమ పెడితే పోటీలో నిలవలేమని అభిప్రాయపడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సైతం రాజ్యసభలో చెప్పారని గుర్తుచేశారు. 200మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటేనే పరిశ్రమ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీ పెట్టొద్దని నివేదిక ఇచ్చిందన్నారు.

కేంద్రం సహకరించకపోయినా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కట్టితీరుతామని స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారన్న కిషన్‌రెడ్డి... ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్‌ చేశారు. నిపుణులు కమిటీ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తెరాస ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బయ్యారం ఫ్యాక్టరీ నిర్మించి.. 10 నుంచి15 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్‌ చెప్పలేదా అని ప్రశ్నించారు.

'నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పాక కూడా తెరాస ప్రభుత్వం వీధినాటకాలు ఆడుతోంది. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేంద్రంపై విషప్రచారం.. తప్పుడు ఆరోపణలే అజెండాగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోంది. భాజపాను, ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు. తెలంగాణలో అనేక సమస్యలు ఉంటే.. ప్రజలంతా సౌఖ్యంగా ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఉన్న సెక్రటేరియట్‌ను కూలగొట్టడమేనా తెలంగాణ మోడల్‌? 8ఏళ్లుగా ఏం వెలగబెట్టారని.. భాజపాపై విమర్శలు చేస్తారు.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

తెలంగాణ మోడల్‌ అంటూ దేశ పర్యటనలు చేస్తున్న కేసీఆర్... ముందు రాష్ట్రంలో ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహహిస్తోందన్న ఆయన.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు సహా అన్ని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.