ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ వ్యక్తిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. నిరంతరం దేశాభివృద్ది, భద్రత కోసం పోరాడే వ్యక్తిగా అభివర్ణించారు. దౌత్యనీతితో పాక్‌ను ఏకాకిని చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన నియంతృత్వ అడుగుజాడల్లో సాగుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి,లక్ష్మణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సరోత్తమరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి వివిధ జిల్లాలకు చెందిన నేతలు భాజపాలో చేరారు. వారందరికి కాషాయ కండువా వేసి ఆహ్వానించారు. ఉపాధ్యాయ సంఘ నేతలు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. తెలంగాణలో భాజపా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: రామ్‌మాధవ్ నెహ్రూ గురించి తప్పుగా మాట్లాడారు: ఉత్తమ్