ETV Bharat / city

విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి​.. కార్మిక సంఘాల నేతల ముందస్తు అరెస్ట్​ - steel union leaders arrest in vishaka

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఏపీ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సభ్యులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

union
విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి
author img

By

Published : Aug 6, 2021, 8:28 PM IST

విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థికమంత్రి​..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సభ్యులను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. నిర్మలా సీతారామన్​ దిల్లీ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్​కు రానున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విశాఖ స్టీల్ పరిరక్షణ సమితి.. ఎయిర్ పోర్ట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఎయిర్ పోర్ట్​లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు అయోధ్యరామ్‌, గంగారామ్‌, వెంకటరావు.. మరికొందరు కార్మికసంఘాల నేతలు, ఉద్యోగులను అరెస్టు చేశారు. అయితే కార్మికుల ఉద్రిక్తతతో విమానాశ్రయం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

విశాఖ చేరుకున్న నిర్మాలా సీతారామన్

ఉత్తరాంధ్రలో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ నగరానికి చేరుకున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్టు అతిథి గృహంలో భాజపా ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు ఇతర నేతలు కలిశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నిర్మలా సీతారామన్​తో భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి.. రేపు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. విశాఖ నుంచి సాయంత్రం 5.55 గంటలకు దిల్లీ తిరిగి వెళతారు.

ఇదీ చూడండి: Electricity : విద్యుత్ సరఫరా నిలిపివేశారని అధికారిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.