ETV Bharat / city

సీజేఐకి నిరుద్యోగుల లేఖ.. 'చనిపోయేందుకు అవకాశం కల్పించండి'

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని కొందరు నిరుద్యోగులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశ తమకు లేదని... కుటుంబాలకు, తల్లిదండ్రులకు భారం కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తమకు చనిపోయేందుకు అవకాశం కల్పించాలని లేఖ ద్వారా జస్టిస్‌ ఎన్‌వీ రమణను కోరారు.

unemployees letter to cji, letter to cji on ap unemployment
సీజేఐకి నిరుద్యోగుల లేఖ, ఏపీ నిరుద్యోగంపై సీజేఐకి లేఖ
author img

By

Published : Jul 21, 2021, 1:54 PM IST

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎం.వి.పి.కాలనీకి చెందిన కొంతమంది నిరుద్యోగులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్‌ నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నామని.. ఈ ఉద్యోగ క్యాలెండర్‌ చాలా నిరుత్సాహానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.

సరైన ఉద్యోగాలు లేక, సమాజంలో తలెత్తుకోలేక, తల్లిదండ్రులకు భారం కాలేక, వారిని పోషించలేని జీవితం వ్యర్థం అనిపిస్తోందని, అందువల్ల తమకు కారుణ్య మరణాలకు అవకాశం కల్పించాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణను లేఖ ద్వారా కోరారు. 'నిరుద్యోగ యువత’ అనే పేరుతో లేఖను విడుదల చేశారు. లక్ష్మీనర్సింహ, సురేష్‌, చక్రి తదితర నిరుద్యోగులు ఈ లేఖ రాసినట్లు దానిపై సంతకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: TS Rains: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వర్షం... ఇబ్బందులు పడుతున్న జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.