ETV Bharat / city

ప్రగతిభవన్​ వద్ద హల్​చల్​.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Suicide Attempt At Pragathi Bhavan: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఓ దివ్యాంగుడు ప్రగతిభవన్​ దగ్గర ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటి మీద పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Unemployed Physically handicapped Attempted Suicide At Pragathi Bhavan

author img

By

Published : Aug 11, 2022, 7:03 PM IST

ప్రగతిభవన్​ వద్ద దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Suicide Attempt At Pragathi Bhavan: ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఓ యువకుడు ప్రగతిభవన్ వద్ద హల్​చల్​ చేశాడు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన తెలుపుతూ ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన దివ్యాంగుడు నాగరాజు.. ప్రగతిభవన్ వద్దకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశాడు. ఈ క్రమంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని బెదిరించాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమై.. వెంటనే నాగరాజును అడ్డుకున్నారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన వినకపోవటంతో.. నాగరాజును అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్​స్టేషన్​కు తరలించారు.

మరోవైపు.. ప్రగతిభవన్​లో కేబినేట్​ భేటీ జరుగుతోంది. సీఎం కేసీఆర్​ అధ్యక్షన మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా.. ఇలా జరగటంతో ప్రగతిభవన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడి హల్​చల్​తో.. రోడ్డుపై కాసేపు ట్రాఫిక్​జామ్​ అయ్యింది. పోలీసులు యువకుడిని అక్కడి నుంచి తరలించి.. ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.