ETV Bharat / city

యూజీసీ-నెట్​ హాల్​టికెట్లు విడుదల.. డౌన్​లోడ్​ చేసుకోండిలా..!

యూజీసీ-నెట్​ పరీక్షలకు సంబంధించి హాల్​టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్​సైట్ https://ugcnet.nta.nic.in ద్వారా తమ హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

యూజీసీ-నెట్​ అడ్మిట్​కార్డులు విడుదల.. డౌన్​లోడ్​ చేసుకోండిలా

author img

By

Published : Nov 16, 2021, 1:01 PM IST

అసిస్టెంట్​ ప్రొఫెసర్ల​ ఎంపిక కోసం నిర్వహించే యూజీసీ-నెట్​ పరీక్షలు (డిసెంబర్ 2020, జూన్ 2021)కి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in ద్వారా విద్యార్థులు తమ హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చని ఎన్​టీఏ వెల్లడించింది. విద్యార్థులు ఈ కింది విధంగా తమ హాల్​ టికెట్​ను పొందవచ్చు.

ఏం చేయాలంటే..

విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in ను సందర్శించాలి. వెబ్‌సైట్ పేజీ కింది భాగంలో డౌన్​లోడ్​ అడ్మిట్​ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే లాగిన్​ పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం అప్లికేషన్ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో హాల్​ టికెట్​ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

గతంలోనే పరీక్షల తేదీలు..

యూజీసీ-నెట్​(జాతీయ అర్హత పరీక్ష) (2020 డిసెంబర్​, 2021 జూన్​) పరీక్ష తేదీలను ఎన్​టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) వెల్లడించింది. యూజీసీ నెట్​ డిసెంబర్​ 2020 పరీక్షలను నవంబర్​ 20, 21, 22, 24, 25, 26, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా నెట్​ జూన్​ 2021 పరీక్షలను డిసెంబర్​ 1, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

అయితే ఈ యూజీసీ నెట్​ పరీక్షలను ఈ నెల​ 17 నుంచి 25 మధ్యలో నిర్వహించాలని గతంలో నిర్ణయించినా.. ఆ తేదీల్లో ఇతర ప్రవేశ పరీక్షలు ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నవంబర్​, డిసెంబర్​ నెలల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఈ నెట్​ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. దీనిని కంప్యూటర్​ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

ఇదీ చూడండి: యూజీసీ-నెట్​ పరీక్ష తేదీలను వెల్లడించిన ఎన్​టీఏ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.