ETV Bharat / city

TTD: ఆనందయ్య ఔషధం తయారీపై సీఎంతో చర్చిస్తాం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఏపీలోని తిరుపతి తుడా కార్యాలయంలో కొవిడ్​పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆనందయ్య ఔషధాన్ని తితిదే ఆధ్వర్యంలో తయారు చేసే అంశంపై తితిదే ఛైర్మన్, సీఎం జగన్​తో చర్చిస్తానన్నారు.

TUDA CHAIRMAN
తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
author img

By

Published : Jun 1, 2021, 7:50 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధాన్ని తితిదే ఆధ్వర్యంలో తయారు చేసే అంశంపై తితిదే ఛైర్మన్, సీఎం జగన్​తో చర్చిస్తానని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని తుడా కార్యాలయంలో కొవిడ్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పంచాయతీల్లో సంపూర్ణ లాక్​డౌన్​ను అమలు చేస్తామని తెలిపారు.

ఆనందయ్య ఔషధాన్ని ఆయుర్వేద మందుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించని కారణంగా తితిదే ఆయుర్వేద ఫార్మసీలో తయారు చేసేందుకు అనుమతులు ఉండవన్నారు. అయితే ప్రజల్లో ఉన్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని...తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో చర్చించిన అనంతరం..సీఎం జగన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లనున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Anandaiah Medicine: ఔషధ తయారీని త్వరలోనే ప్రారంభిస్తాం: ఆనందయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.