ETV Bharat / city

'బీసీ పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి'

హైదరాబాద్ లక్డీకాపూల్​లోని ఓ హోటల్​లో ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకతపై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు బీసీ సంఘల నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకొని బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రమణ కోరారు.

l ramana request to bc's to register vote for graduate mlc elections
ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకతపై ఆత్మీయ సమ్మేళనం
author img

By

Published : Oct 30, 2020, 5:22 PM IST

ఓటు హక్కుతోనే రాజ్యాధికారం దక్కుతుందని, ఆ దిశగా బీసీలు అడుగులు వేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎన్నికలను డబ్బు, ప్రాంతం, మతం, కులం ప్రభావితం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్​లోని ఓ హోటల్​లో ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో.. ఓటు ఆవశ్యకతపై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఎంబీసీ, బీసీ సంఘల నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు.

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క బీసీ విద్యార్థి తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. తాను సాధారణ కార్యకర్త నుంచి మంత్రిగా, ఎంపీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశానని ఎల్.రమణ చెప్పారు. తాము సాధించాల్సిన లక్ష్యాలపై ముందుగా అవగాహన పెంచుకుంటే గమ్యం చేరుకోవచ్చునన్నారు. బీసీ పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకొని బీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రమణ కోరారు.

ఇవీ చూడండి: దుబ్బాక ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ శాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.