పేదలకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వలన నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని, అన్నదాతల ఆక్రోశం పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన తెరాస... ఉద్యమం సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.
ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని రమణ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి రమణ నివాళులర్పించారు. అనంతరం అమరవీరుడు నాగులు కుటుంబానికి పది వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.