తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల(Tirumala Online Special Darshan tickets)ను తితిదే శుక్రవారం రోజున విడుదల చేయనుంది. రోజుకు 12 వేల టికెట్లు చొప్పున నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 23న నవంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న 27,878 మంది భక్తులు
బుధవారం.. శ్రీవారిని 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.2.57 కోట్ల ఆదాయం సమకూరింది.