ETV Bharat / city

తితిదే రీఫండ్ గడువు డిసెంబరు 31 వరకు పొడగింపు

లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి బుక్ చేసుకున్న భ‌క్తులకు తితిదే రీఫండ్​ను అందిస్తోంది. డిసెంబరు 31 వరకు అవకాశాన్ని కల్పించింది.

డిసెంబరు 31 వరకు
డిసెంబరు 31 వరకు
author img

By

Published : Oct 29, 2020, 11:18 AM IST

లాక్​డౌన్​లో శ్రీవారి టికెట్లు బుక్ చేసి రద్దు చేసుకున్న భక్తులకు తితిదే... డబ్బులను రీఫండ్ చేస్తోంది. మార్చి 13 నుంచి జూన్ 30 వ‌ర‌కు ఆన్‌లైన్, పోస్టాఫీసు, ఈ- ద‌ర్శ‌న్, ఏపీ ఆన్​లైన్ కౌంట‌ర్ల ద్వారా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ. 300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్నితితిదే తిరిగి అందిస్తోంది. వాటి గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు తితిదే ప్రకటించింది.

పోస్టాఫీసు, ఈ- దర్శన్ కౌంటర్లు, ఏపీ ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తో పాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివ‌రాల‌ను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాల‌ని తితిదే ప్రకటించింది. మెయిల్ వివ‌రాలను ప‌రిశీలించిన అనంత‌రం మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేయనున్నట్లు ప్రకటలో తెలిపింది.

టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31లోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. 2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవ‌కాశం కల్పించినట్లు తెలిపారు.‌ tirupatibalaji.ap.gov.in ద్వారా బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

ఇదీ చూడండి: అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.