ETV Bharat / city

రేపే రథసప్తమి...తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

ఏపీలోని తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహణకు తితిదే సర్వం సిద్ధంచేసింది. శనివారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై దర్శనమివ్వనున్నారు. ఒకే రోజున అన్ని వాహన సేవలను దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు భారీగా తరలిరానున్నారు.

Rathasaptami in Tirumala
Rathasaptami in Tirumala
author img

By

Published : Jan 31, 2020, 10:09 PM IST

రేపే రథసప్తమి...తిరుమలలో వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

సూర్యజయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు వాహనాలపై తిరువీధుల్లో ఊరేగుతూ దర్శనమివ్వనున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారి సూర్యప్రభవాహన సేవతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం చిన శేష, గరుడ, హనుమంత వాహనాలపై మలయప్పస్వామి భక్తులను కటాక్షిస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి 3 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో విహరిస్తారు.

రథసప్తమి పర్వదినాన ఒకే రోజు ఏడు వాహన సేవలను దర్శించుకోవటంతో పాటు చక్రస్నానంలో పాల్గొనే అవకాశం ఉండడం వల్ల ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారు విహరించే నాలుగు తిరుమాఢ వీధుల్లో భక్తులు వేచి ఉండేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలను, తాగునీరు నిరంతరంగా సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలతో భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిద్ధం చేశారు. రథసప్తమి పురస్కరించుకుని శనివారం నాడు అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.

ఇదీ చదవండి:

తిరుమల చేరుకున్న తమిళనాడు సీఎం పళనిస్వామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.