ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య క్రమంగా పెంచేలా చర్యలు తీసుకుంటామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న వసతులను ఆయన పరిశీలించారు.
కల్యాణకట్ట, అన్నప్రసాద వితరణ భవనాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. భౌతికదూరం, శుభ్రత పాటించడంలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి : యాదాద్రి జడ్పీ సీఈవో దంపతులకు కరోనా