ETV Bharat / city

ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..? - ts rtc strike latest news

ఆర్టీసీ సమ్మె 45వ రోజుకు చేరింది. ప్రభుత్వం పట్టు వీడటం లేదు.. మెట్టు దిగటం లేదు..?  అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం మధ్య సయోధ్య కుదరటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మె... కార్మికులపై పెను ప్రభావం చూపిస్తోంది. కుటుంబాన్ని పోషించలేక.. మరోపనికి వెళ్లలేక నరకం అనుభవిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?
author img

By

Published : Nov 18, 2019, 5:17 AM IST

Updated : Nov 18, 2019, 8:14 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను సాధించుకోవడానికి చేపట్టిన సమ్మె.. ధర్నాలు, దీక్షలు, అరెస్టులతో ఉద్ధృతంగా కొనగుతోంది. ఐకాస నేతల దీక్షల భగ్నంతో జిల్లాల్లో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెలుకున్న కార్మికులు ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుని ధర్నాలు నిర్వహించారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు కార్మికులకు మద్దతుగా నిలిచారు.

ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?

ఉస్మానియాలో కొనసాగుతున్నఅశ్వత్థామరెడ్డి దీక్ష
ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీఎన్‌ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో అశ్వత్థామ స్వీయ నిర్బంధంలో ఉంటూ నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్ల పోలీసులు అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేవరకూ దీక్షను విరమించేది లేదని అశ్వత్థామరెడ్డి తేల్చిచెప్పారు.
"​ అశ్వత్థామరెడ్డి చికిత్సకు సహకరించడం లేదని ఉస్మానియా వైద్యులు తెలిపారు. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించకపోతే ప్రాణానికే ముప్పు అని ఆర్‌ఎంవో రాజ్‌కుమార్‌ వెల్లడించారు. ( ఇదీ చదవండి: గంటగంటకూ క్షీణిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం )

రాజిరెడ్డి దీక్ష భగ్నం
ఎల్బీనగర్​ పరిధిలోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్​ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు రాజిరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం రాజిరెడ్డి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.
దుర్మార్గ పాలన సాగుతోంది: తెజస
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఉస్మానియాలో దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. సమస్యలు పరిష్కరించేంత వరకు అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

"తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నం. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు కొన్ని చర్యలు తప్పవు.. ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి చర్చలు లేవు"- గతంలో సీఎం కేసీఆర్​ ( ఇదీ చదవడి: 'ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాం')

ఖండించిన నేతలు

  • ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ఆర్టీసీ యూనియన్లు, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు.
  • అశ్వత్థామరెడ్డిని ఈడ్చుకొని బలవంతంగా తరలించడం బాధాకరమని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించాలని దీక్షకు మద్దతు తెలిపిన భాజపా నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ డిమాండ్‌ చేశారు.
  • రాష్ట్రంలో పోలీస్‌ శాఖ మినహా ఇతర శాఖలు పనిచేయడంలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం తార్నాకలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేసీఆర్‌ రాజ్యాంగం చదువుకుంటే పరిపాలన వ్యవస్థ తెలుస్తుందని హితవు పలికారు.

వైద్యానికి డబ్బులేక - ఆర్టీసీ డ్రైవర్‌ కొడుకు మృతి

సమ్మెతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్‌ వైద్య ఖర్చులు భరించలేక కొడుకు ప్రాణాలు కోల్పోయిన దైన్యమిది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఈ విషాద ఘటన జరిగింది. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ రమేశ్‌, రజిత దంపతులు జడ్చర్లలోని సిగ్నల్‌గడ్డలో నివాసం ఉంటున్నారు. రమేశ్‌ హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 20 రోజుల కిందట అతని పెద్ద కుమారుడు సాయికుమార్‌ అస్వస్థతకు గురయ్యాడు. అతడికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా రూ.3 లక్షల వరకు ఖర్చైంది. అయినా అనారోగ్యం నుంచి కోలుకోలేదు. వైద్య ఖర్చులు చెల్లించడానకి డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో కొడుకును రెండు రోజుల కిందట ఇంటికి తీసుకువచ్చారు. అనారోగ్యంతో సాయికుమార్‌ మరణించాడు. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును కోల్పోయామని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

  • ఆర్టీసీ కార్మికులకు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ప్రభుత్వ ఉపాధ్యాయులు బాసటగా నిలిచారు. ఆదివారం 83 మంది ఆర్టీసీ కార్మికులకు రూ.లక్ష విలువైన నిత్యావసర సరకులను పంపిణీ చేసి ఉదారతను చాటారు. ప్రతి కార్మిక కుటుంబానికి 25 కిలోల బియ్యం, పప్పు, నూనె, వంటి నిత్యావసర సరకులను అందజేశామని ఉపాధ్యాయ ఐకాస నాయకులు శామ్యూల్‌, ఆడె ప్రకాశ్‌లు చెప్పారు.
    HYD_RTC_STRIKE
    ఆర్టీసీ కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ

జిల్లాలు- ఆందోళనలు, అరెస్టులు

  1. నల్గొండలో ఆర్టీసీ కార్మికులు గడియారం సెంటర్​ వద్ద సామూహిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. కార్మికుల నిరసనకు అఖిలపక్ష పార్టీలు మద్దుతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెను మించిపోయిందని భాజపా నేతలు పేర్కొన్నారు.
  2. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు సామూహిక దీక్షలు చేపట్టారు. ఆర్టీసీని కార్మికులకు అప్పగిస్తే ఏడాదిలోనే రూ.500 కోట్ల లాభాలు చూపిస్తామని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు.
  3. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు తమ నిరసన తెలియజేస్తూ... సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి కఠిన వైఖరి... చిన్న వేతన జీవుల పాలిట శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
  4. సిద్దిపేట జిల్లాలో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
  5. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఆంజనేయులు... రోజువారీ కూలీ పనికి వెళ్తున్నాడు. రెండు నెలలుగా జీతాలు లేక ఇళ్లు గడవటం కష్టంగా మారింది. సమ్మెలో పాల్గొంటూనే కూలీ పనికి వెళ్తున్నట్లు అంజనేయులు తెలిపాడు.
  6. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు బస్ రోకో నిర్వహించారు. డిపో నుంచి బస్టాండ్​ వరకు ర్యాలీ చేపట్టారు . కార్మికులందరూ ముక్కును నేల రాసి నిరసన తెలిపారు. మహిళా కార్మికులు చెప్పులతో కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు.
  7. మహబూబాబాద్​ జిల్లా బస్టాండ్​ ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. సేవ్​ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్​ చేసి ఠాణాకు తరలించారు.ప్రజలు ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.
  8. మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు 44వ రోజు సమ్మెలో భాగంగా బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నియంత్రించారు. కార్మికులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది.
  9. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద కార్మికులు దీక్షలు చేపట్టారు. 44 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు.

Intro:Body:Conclusion:
Last Updated : Nov 18, 2019, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.