ETV Bharat / city

TSRTC MD sajjanar interview : 'ప్రయాణికులకు దగ్గరవ్వడమే మా ప్రధాన లక్ష్యం'

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD sajjanar). బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రథచక్రాలను ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కరోనా వల్ల ప్రజారవాణా మూటగట్టుకున్న నష్టాల(TSRTC is in loss)ను లాభాలుగా మార్చడానికి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.

TSRTC MD sajjanar interview
TSRTC MD sajjanar interview
author img

By

Published : Nov 14, 2021, 9:05 AM IST

‘‘రెండు దశల కరోనా ప్రభావంతో(corona effect on TSRTC)పాటు వివిధ కారణాల వల్ల ఆర్టీసీకి దూరమైన ప్రయాణికులకు చేరువ కావడమే లక్ష్యం. ఇందుకు సరికొత్త ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రాతిపదికన వినియోగంలోకి తేవడానికి ఏం చేయాలన్న దానిపై సీనియర్‌ అధికారులతో కమిటీ వేశాం’’ అని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్‌(TSRTC MD VC sajjanar) తెలిపారు. భాగ్యనగరంలో ఆర్టీసీ(TSRTC in Hyderabad)ని గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ఇచ్చిన ముఖాముఖి(TSRTC MD sajjanar interview with ETV Bharat)లో వివరించారు.

ఈటీవీభారత్ : కొవిడ్‌ వల్ల కలిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయనున్నారు?

ఎండీ : జనం వద్దకే బస్సులను తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. సర్వీసులు లేని పెద్ద కాలనీలకు సేవలు విస్తరించనున్నాం. ఆయా కాలనీల వాసులూ వినియోగించుకొనేలా చేయగలిగితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఏ సమయంలో సర్వీసులు అవసరం. ఆ సమయంలో ఆయా రూట్లలో బస్సుల సంఖ్య ఏమేరకు ఉంది అన్న దానిపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తున్నాం. తదనుగుణంగా ప్రణాళిక రచిస్తున్నాం.

ఈటీవీభారత్ : ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో సగానికి పైగా పది లక్షలు ఆపైన కి.మీ తిరిగినవే. పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తారా?

ఎండీ : దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కొత్తవి కొనుగోలు చేయడంకంటే ఉన్నవాటికి మరమ్మతులు చేసి సమర్థంగా వినియోగించుకోవాలన్న దానిపైనే దృష్టిసారించాం. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌(Telangana transport minister Puvvada Ajay Kumar) సూచనలకు అనుగుణంగా నిర్ణయాలుతీసుకుంటాం.

ఈటీవీభారత్ : నగర పరిధిలో భారీ నష్టాలను ఎలా అధిగమించనున్నారు?

ఎండీ : డీజిల్‌ ధరలు(fuel price hike) భారీగా పెరగడమే నష్టాలకు కారణం. రాష్ట్రవ్యాప్తంగా టిక్కెట్‌ ధరల పెంపు(TSRTC ticket fair hike)పై నిర్ణయం తీసుకుంటే నష్టాలను కొంతమేర అధిగమించగలం. ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) ఆర్టీసీని పటిష్ఠం చేసి సామాన్యులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న తలంపుతో ఉన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని రాబోయే రోజుల్లో ఆర్టీసీని లాభాల బాట(Profits for TSRTC) పట్టిస్తాం.

ఈటీవీభారత్ : ఏ ప్రభుత్వ శాఖకు లేని విధంగా రాజధానిలో ఆర్టీసీకి రూ.వేల కోట్ల విలువైన స్థలాలున్నాయి. కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న వీటిని వినియోగంలోకి తీసుకొచ్చి సంస్థకు ఆర్థిక భరోసా కల్పిస్తారా?

ఎండీ : బాధ్యతలు చేపట్టిన వెంటనే ఖాళీ స్థలాల వివరాలను తెప్పించుకొని పరిశీలించాను. ఇవన్నీ రద్దీ ప్రదేశాల్లో ఉన్నాయి. వాటిని ఎలా వినియోగంలోకి తీసుకొస్తే సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుందన్న దానిపై నివేదిక ఇవ్వడానికి సీనియర్‌ అధికారులతో కమిటీని వేశాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చాక రవాణా శాఖ మంత్రి అజయ్‌(Telangana transport minister Puvvada Ajay kumar), ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌(TSRTC chairman Bajireddy Govardhan)తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వాటి ద్వారా ఎంత ఆదాయాన్ని సమకూర్చుకోగలిగితే అంతమేర ఆర్టీసీలో మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.