TSRTC sankranthi income: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిందని ఆర్టీసీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. సంక్రాంతి సందర్బంగా టీఎస్ ఆర్టీసీ సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా సుమారు 4వేల బస్సులను ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నడిపించింది. ఆర్టీసీలో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చామని ఆర్టీసీ ప్రకటించింది. తద్వారా ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కరోనాకు ముందు ఆర్టీసీకీ రోజుకు రూ.12 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చేది. కానీ... సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు రూ.15.2 కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: 'మీరే ఆదుకోవాలి సారూ.. అంటూ మంత్రి కాళ్లపై పడ్డ రైతులు'