ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్(TSICET counselling 2021 news) ఆదివారం నుంచి మొదలుకానుంది. కొత్తగా కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 21న ప్రాసెసింగ్ రుసుం చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. వారికి 22న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అనంతరం వారు 22, 23 తేదీల్లో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 26న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి విడత నాటికి కన్వీనర్ కోటాలో 26,845 సీట్లు (ఎంబీఏ, ఎంసీఏ) ఉండగా వాటిలో 19,209 మందికి సీట్లు దక్కాయి. చివరి విడత కౌన్సెలింగ్(TSICET counselling 2021 news)కు మరికొన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక కౌన్సెలింగ్..
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ(జీఎఫ్‌టీఐ(Government Film and Television Institute))ల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం సెంట్రల్ సీట్ అలకేషన్ అథారిటీ(సీశాబ్(Central Seat Allocation Board news)) రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆరు విడతల జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా(Joint Seat Allocation Authority news)) కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది.
ఈ క్రమంలో ఐఐటీ(IITs in India)లు మినహా మిగిలిన విద్యాసంస్థల్లో ఖాళీ సీట్లను భర్తీ చేస్తారు. ఇందుకోసం ఆ సంస్థల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను ఈ నెల 27న వెల్లడిస్తారు. 28 నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మొదటి విడత సీట్లను డిసెంబరు 2న, రెండో విడత సీట్లను డిసెంబరు 7న కేటాయిస్తారు. పూర్తి వివరాలకు www.csab.nic.in వెబ్‌సైట్ చూడవచ్చు.