ETV Bharat / city

Tsafrc: 'ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం లేదు..'

Tsafrc: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారులో ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాలు అమలు చేయలేమని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ టీఎస్ఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. రుసుముల ఖరారులో ఏఎఫ్ఆర్సీలదే తుది నిర్ణయమని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని ఏఐసీటీఈకి రాష్ట్ర రుసుముల నియంత్రణ కమిటీ లేఖ రాసింది. నిలిచిపోయిన ఫీజుల ఖరారు ప్రక్రియలో త్వరలో మళ్లీ ప్రారంభించేందుకు టీఎస్ఏఎఫ్ఆర్సీ సిద్ధమవుతోంది. కళాశాలల ఆదాయ, వ్యయాల ఆధారంగానే రానున్న మూడేళ్లకు ఫీజులను నిర్ణయించనున్నారు.

టీఎస్ఏఎఫ్ఆర్సీ
టీఎస్ఏఎఫ్ఆర్సీ
author img

By

Published : Jun 29, 2022, 2:49 PM IST

Updated : Jun 29, 2022, 2:55 PM IST

Tsafrc: తెలంగాణలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజల ఖరారులో ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ టీఎస్ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. ఈమేరకు ఏఐసీటీఈకి లేఖ రాసింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్, ప్లానింగ్, లా, ఫార్మాలో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు.. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంఈడీ, డీఎడ్ కోర్సుల ఫీజులపై మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది.

గత రుసుములను ఖరారు చేసి మూడేళ్లయినందున రానున్న మూడేళ్ల కోసం గతేడాది నవంబరు29న సమీక్ష ప్రక్రియను ప్రారంభించారు. ఫీజులను సమీక్షించేందుకు 2020-21 విద్యా సంవత్సరం ఆదాయ, వ్యయ వివరాలను సమర్పించాలని వృత్తి విద్య కళాశాలలకు సూచించింది. కళాశాలలు ఆదాయ, వ్యయాలు, ఇతర నివేదికలను ఏఎఫ్ఆర్సీకి సమర్పించాయి. టీఎస్ఏఎఫ్ఆర్సీ మే16 నుంచి రోజుకు కొన్ని కాలేజీల యాజమాన్యాలను పిలిపించి విచారణ ప్రక్రియ చేపట్టింది. అయితే కనిష్ఠ, గరిష్ఠ ఫీజులను ఖరారు చేస్తూ మే19న ఏఐసీటీఈ నుంచి తాజా మార్గదర్శకాలు వచ్చాయి.

ఫీజులపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను కేంద్ర విద్యా శాఖ ఆమోదించిందని అందులో పేర్కొంది. ఫలితంగా ఇంజినీరింగ్ కు కనీసం రూ.79,600 గరిష్ఠంగా రూ.లక్షా 89 వేల 800లు.. ఎంబీఏకు కనీసం రూ.85వేలు గరిష్ఠంగా రూ.లక్షా 95 వేల 200 ఉండాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీస రుసుము రూ.35 వేలు గరిష్ఠంగా రూ.లక్ష 34వేలుగా ఉంది. రానున్న మూడేళ్లకు కూడా ఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలు చాలని కొన్ని గ్రామీణ ప్రాంత కాలేజీలు ఇప్పటికే ఏఎఫ్ఆర్సీని కోరాయి.

మరోవైపు ర్యాంకు పదివేలు దాటిన బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.35 వేల కనీస ఫీజునే రీఎంబర్స్ చేస్తోంది. దీంతో ఏఐసీటీఈ ఆదేశాలపై ఏం చేయాలనే సందిగ్ధత ఏర్పడటంతో ఫీజలు సమీక్ష ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. వివిధ అంశాలపై లోతుగా చర్చలు జరిపిన ఏఎఫ్ఆర్సీ ఫీజుల విషయంలో ఏఐసీటీఈ ఆదేశాలు అమలుకు సాధ్యం కాదని తేల్చింది.

ఫీజులను ఆయా కాలేజీల్లో పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీలదే తుది నిర్ణయమని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఏఎఫ్ఆర్సీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఫీజుల విషయంలో తాజా మార్గదర్శకాలు అమలుకు సాధ్యం కాదని ఇటీవల ఏఐసీటీఈకి ఏఎఫ్ఆర్సీ లేఖ రాసింది. గతంలో నిలిచిపోయిన ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సుల సమీక్ష ప్రక్రియను వారం రోజుల్లో తిరిగి ప్రారంభించాలని ఏఎఫ్ఆర్సీ భావిస్తోంది. ప్రవేశ పరీక్షలు పూర్తయి కౌన్సెలింగ్ కు సిద్ధమయ్యేనాటికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు ఏఎఫ్ఆర్సీ ప్రణాళిక చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజినీరింగ్, వృత్తి విద్య ఫీజులు ఎంత మేరకు పెరగనున్నాయనే ఉత్కంఠ విద్యార్థులు, తల్లిదండ్రుల్ల కొనసాగుతోంది.

ఇదీ చదవండి: మళ్లీ మళ్లీ అదే తప్పు.. ఇంటర్ బోర్డు తీరు మారదా..?

'సోషల్​ మీడియాలో వచ్చిందే వాస్తవం'.. 87% భారతీయుల్లో ఇదే వైఖరి

Last Updated : Jun 29, 2022, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.