ETV Bharat / city

ఆగస్టులో పాలిసెట్‌ నిర్వహణకు విద్యామండలి నిర్ణయం - టీఎల్‌ పాలిసెట్‌-2020

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడ్డ టీఎస్‌ పాలిసెట్-2020‌ని ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నిర్ణయించింది. పాలిసెట్‌ దరఖాస్తుకు మరో అవకాశం కల్పించామని... ఈ నెల 13 నుంచి 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చుని మండలి కార్యదర్శి తెలిపారు.

ts higher educations conduct polycet entrance exam in month of august 2020
ఆగస్టులో పాలిసెట్‌ నిర్వహణకు విద్యామండలి నిర్ణయం
author img

By

Published : Jul 10, 2020, 10:49 PM IST

కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ పాలిసెట్‌ను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నిర్ణయించింది. పాలిసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు ఎస్‌బీటీఈటీ తెలిపింది. ఈ నెల 13 నుంచి 25 వరకు రూ.200 లతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చుని మండలి కార్యదర్శి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతోన్న చర్యల్లో భాగంగా పాలిసెట్‌- 2020ని వాయిదా వేసింది ఎస్‌బీటీఈటీ.

ఎస్సీ గురుకులాల్లో ఈ నెల 17 వరకు...

ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 17లోగా ఆయా కాలేజీల్లో టీసీ, కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా చేరకపోతే అడ్మిషన్ రద్దవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రార్థనా మందిరాలను కూల్చివేయడంపై ఉత్తమ్​ అగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.