ETV Bharat / city

కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు - తెలంగాణపై కరోనా ప్రభావం

రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్​ కేసు నమోదై నేటికి ఏడాది గడిచిందని.. తొలి బాధితుడికి గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. ఈ 365 రోజులు కంటిమీద కునుకు లేకుండా నిరంతరాయంగా సేవలందించారని.. గాంధీ ఆస్పత్రి సిబ్బందిని ఈటల అభినందించారు.

eetala
కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై మంత్రి ఈటల ప్రశంసల జల్లు
author img

By

Published : Mar 2, 2021, 11:25 AM IST

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది గడిచిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చేర్పించినప్పుడు ఎన్నో సందేహాలు, భయాలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. ఏడాది కాలంగా వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమించారని, కరోనా చికిత్సలో అనుభవం సంపాదించారన్నారు.

గాంధీ ఆస్పత్రిలో సుమారు 35 వేల మంది కరోనా బాధితులకు చికిత్స చేసినట్లు ఈటల చెప్పారు. అందులో సుమారు 7 వేల మందిని అత్యవసర విభాగంలో ఉంచి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా కరోనా సోకిన గర్భిణీలకు గాంధీ వైద్యులు ప్రసవం చేశారని కొనియాడారు.

కరోనా పాజిటివ్​ వచ్చిన దాదాపు 7 వేల మంది కిడ్నీ రోగులకు చికిత్స అందించిన ఖ్యాతి గాంధీ ఆస్పత్రికే దక్కిందన్నారు. సుమారు 365 రోజులుగా తమ సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా సేవలందించారని.. ఈటల రాజేందర్​ ప్రశంసించారు.

కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై మంత్రి ఈటల ప్రశంసల జల్లు

ఇవీచూడండి: కొవాగ్జిన్​ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.