ETV Bharat / city

ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం! - తెలంగాణలో ఆన్​లైన్​ తరగతులపై విద్యాశాఖ సమీక్ష

ts eamcet likely to be held on september says education minister sabitha indra reddy

author img

By

Published : Aug 10, 2020, 5:33 PM IST

Updated : Aug 11, 2020, 4:38 AM IST

17:32 August 10

సెప్టెంబరు 9, 10, 11, 14న ఎంసెట్..!

కరోనా పరిస్థితులతో స్తంభించిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.  

ఈనెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ముందుగా ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానల్ ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

కరోనా పరిస్థితులు కొంచెం మెరుగుపడినా.. ప్రాథమిక పాఠశాలలు ఇప్పట్లో ప్రారంభించే పరిస్థితి ఉండక పోవచ్చునని విద్యాశాఖ భావిస్తోంది. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకూ సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ పాఠాలు బోధించాలని నిర్ణయించింది. ఈనెల 17 నుంచి సగం పాఠశాలలకు సగం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల ఆన్​లైన్ తరగతుల నిర్వహణకు నిర్దిష్ట సమయం, ఇతర విధి విధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

ఇంటర్​ ప్రవేశాలపై..

      ఈనెల 17 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్​లైన్, డిజిటల్ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. టీవీలు, యూట్యూబ్ ఛానల్  ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ ఒకటి తరువాత ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.  

హైకోర్టు అనుమతిస్తే..

డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి దోస్త్ ప్రక్రియను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు మాత్రం కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుందని.. ప్రత్యామ్నాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ప్రాథమిక షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు.  

ఎంసెట్ పరీక్షపై..

       ఈనెల 31న ఈసెట్, సెప్టెంబరు 2న పాలిసెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ నిర్వహించాలని  భావిస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా.. మరోవైపు విద్యా సంవత్సరం నష్టపోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

ఇవీచూడండి: నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Aug 11, 2020, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.