ETV Bharat / city

అలాంటి వారికి కరోనా రావాలి: సీఎం కేసీఆర్​ - కరోనాపై కేసీఆర్​

రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం తక్కువగానే ఉందని.. సమస్య తీవ్రత తగ్గే అవకాశం కనిపిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పాజిటివ్ వచ్చిన 11 మందిని ఇంటికి పంపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి ప్రభుత్వ నిఘాలో ఉన్న 25వేలకు పైగా కరోనా అనుమానితులు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుంటారని చెప్పారు. కరోనా విషయంలో దుష్ప్రచారం చేసే వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

kcr
అలాంటి వారికి కరోనా రావాలి: సీఎం కేసీఆర్​
author img

By

Published : Mar 30, 2020, 5:58 AM IST

అలాంటి వారికి కరోనా రావాలి: సీఎం కేసీఆర్​

కరోనా కట్టడి చర్యలు, లాక్​డౌన్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సుధీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. జిల్లాల వారిగా పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని కేసుల సంఖ్య 70కి చేరుకుందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పూర్తిగా కోలుకున్నారని వారిని ఇవాళ ఆస్పత్రి నుంచి ఇంటికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మిగతా వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారిని కూడా త్వరలో ఇంటికి పంపిస్తామన్నారు.

ఏప్రిల్​ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ..

రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 25, 937 మంది ప్రభుత్వాధికారుల నిఘాలో ఉన్నారని.. వారిని 5,746 బృందాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయని సీఎం తెలిపారు. నిఘాలో ఉన్న వారి 14 రోజుల క్వారంటైన్ గడువు ఏప్రిల్ ఏడో తేదీన పూర్తవుతుందన్నారు. కొత్తగా కేసులు వచ్చే అవకాశం లేనందున.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని, విశ్రాంత వైద్యులు, నర్సులు, సిబ్బందికి సమాచారం అందించి ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని కోరుతామన్నారు.

ఇదే స్ఫూర్తితో..

లాక్​డౌన్​కు ప్రజలు బాగా సహకరిస్తున్నారన్న కేసీఆర్​.. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని.. దక్షిణ కొరియాలో ఒకే ఒక వ్యక్తి నుంచి 59 వేల మందికి వ్యాధి సోకిన ఉదంతాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తీవ్రమైన క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని.. ప్రజలు సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడతామన్నారు. హోం క్వారంటైన్​లో ఉన్న వారిపై నిఘా మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మ, బత్తాయి, సంత్ర వంటి సి విటమిన్ అధికంగా లభించే పండ్లను స్థానిక మార్కెట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్​లో 500 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రేషన్​కార్డుల మీద బియ్యం, నగదు పంపిణీ త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజల బాధ్యత తెలంగాణ చూసుకుంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తిస్థాయి వసతి, ఆహార సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల వారికి కూడా ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆపత్కాల పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కరోనా విషయంలో దుష్ప్రచారం చేసే వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వారికి కఠిన శిక్షలు విధిస్తామన్న ఆయన... అసలు ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవారికి కరోనా వ్యాధి రావాలని అసహనం వ్యక్తం చేశారు. పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని బయోమెట్రిక్ అవసరం లేకుండా స్థానిక సర్పంచ్​లు, అధికారులు చర్యలు తీసుకోవాలని.. అవినీతికి, మోసానికి పాల్పడితే బాగుండదని హెచ్చరించారు.

ఇవీచూడండి: కరోనా పంజా: భారత్​లో 27కు చేరిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.