TS B-PASS: గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండ్ల అనుమతులకు టీఎస్ బీపాస్ విధానం అమలు కానుంది. ఇందుకోసం ఇప్పటికే విధివిధానాలు ఖరారయ్యాయి. పురపాలక, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జనన, మరణాలు వందశాతం నమోదుపై చర్చించిన సీఎస్... ఆసుపత్రులతో పాటు శ్మశానవాటికల వద్ద కూడా నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల డేటాను అనుసంధానించాలని తెలిపారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన సోమేశ్ కుమార్... పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో విజయవంతమైన టీఎస్ బీపాస్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని సీఎస్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ టీఎస్ బీపాస్ త్వరగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: