వరద బాధితుల సాయం కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విరాళం ప్రకటించారు. రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ ప్రజా ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు భారీ స్పందన వస్తోంది.
ఇవీచూడండి: విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం