వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్... కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారని తెరాస ఎంపీలు దిల్లీలో ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఎప్పుడూ బిల్లుల ఆమోదం జరగలేదని స్పష్టం చేశారు. సవరణలు, చట్టబద్ధమైన తీర్మానాలను నిబంధనలకు విరుద్ధంగా తోసిపుచ్చారన్న ఎంపీ కేకే... రాజ్యాంగ వ్యతిరేకబిల్లులపై సభలో తీవ్ర నిరసన తెలియజేసినట్లు వెల్లడించారు.
డిప్యూటీ ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా... సభ అధ్యక్షుడి హోదాలో డిప్యూటీ ఛైర్మన్ కొనసాగే అవకాశం లేదని తెలిపారు. బిల్లుల్లో అన్ని అంశాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవే ఉంటే.... కేంద్రం పార్టీలను ఎందుకు సమన్వయం చేయలేకపోయిందని ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు.
ఇదీ చూడండి: గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం