ETV Bharat / city

'రాజకీయాల వల్లే పీవీకి సరైన గుర్తింపు రాలేదు'

ఏ విధంగా చూసినా పీవీ నరసింహారావు చాలా గొప్ప వ్యక్తి అని పీవీ శతజయంత్యుత్సవాల కమిటీ ఛైర్మన్​, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కంచర్ల కేశవరావు అన్నారు. ఆయన పేరును, ఔన్నత్యాన్ని చరిత్రలో నిలపాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. ఉత్సవాల సందర్భంగా ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు.

pv narasimharao
'రాజకీయాల వల్లే పీవీకి సరైన గుర్తింపు రాలేదు'
author img

By

Published : Jun 27, 2020, 4:57 AM IST

తెలంగాణ బిడ్డ, తెలుగు వాడు...దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు అని ఎంపీ కేకే అన్నారు. అయిదేళ్ల పాటు విజయవంతంగా పదవిని నిర్వహించారని తెలిపారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడారని కొనియాడారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలని కితాబిచ్చారు.

శతజయంత్యుత్సవాల సంకల్పం ఏమిటి

ఇదంతా కేసీఆర్‌ చొరవే. దేశంలో మహానేతల్లో ఒకరైన పీవీకి ఆశించిన గుర్తింపు రాలేదు. చిన్నచూపు చూశారు. ఎన్నో రకాలుగా అవమానం జరిగింది. ఆరేళ్ల పాటు అధ్యక్షునిగా పనిచేసినా.. పార్టీ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని పెట్టలేదు. సగం సింహం అని ఆయన పేరు మీద ఒక పుస్తకం వచ్చింది. సగం సింహం కాదు. పూర్తి సింహమని నిరూపించాలని, ఇదే సరైన సందర్భం అని సీఎం భావించారు.

ఏడాది పొడవునా ఉత్సవాల నిర్వహణలో ఉద్దేశం

నేటి తరంలో చాలా మందికి పీవీ ఎవరో తెలియదు.ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశంలో అత్యుత్తమ పదవిగా చెప్పే ప్రధాని స్థాయికి చేరడం ఒక అద్భుతం. రాజీవ్‌గాంధీ చనిపోయాక, భావోద్వేగాల నడుమ ప్రధాని పదవి చేపట్టారు. సామరస్యంగా, స్థిరంగా, శాంతియుతంగా ప్రభుత్వాన్ని నడిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలతో గట్టెక్కించారు. నూతన ఆర్థిక విధానం తెచ్చారు. ప్రపంచీకరణ నినాదం ఆయన చలవే. పీవీ గొప్ప విద్యావేత్త. బహుభాషాకోవిదుడు. నవోదయ, గురుకుల పాఠశాలలకు ఆద్యుడు. గొప్ప పార్లమెంటేరియన్‌. ఆయన ప్రసంగాలు వినసొంపుగా ఉండేవి. ప్రతి సందర్భంలో ఉపనిషత్తులు వినిపించేవి. పీవీకి ముందు...పీవీ తర్వాత అనే కోణంలో కార్యక్రమాలుంటాయి. ఇలా వీటన్నింటి గురించి చెప్పడానికి ఏడాది సరిపోదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఏ కార్యక్రమం నిర్వహించినా మూలాల్లోకి వెళతారు. పీవీకి తెలంగాణ బిడ్డగా గౌరవం దక్కాలన్నదే ఆయన తపన.

పీవీ పనితీరును ఎలా విశ్లేషిస్తారు

నా దృష్టిలో ఆయనవి అన్నీ విజయాలే. వైఫల్యాలు లేవు. ప్రధానిగా ఆయనకు తిరుగులేదు. ముఖ్యమంత్రిగానూ రాణించారు. దున్నే వానికే భూమి అనే మహాత్మాగాంధీ ఇచ్చిన నినాదం స్ఫూర్తిగా భూసంస్కరణలు తేవడం సాహసోపేత నిర్ణయం. ఇందిరా కాంగ్రెస్‌, రెడ్డి కాంగ్రెస్‌గా కాంగ్రెస్‌ పార్టీ విడిపోయిన సమయంలో ఆయన రాజకీయంగా పరిణతిని ప్రదర్శించారు. ఏడో దశకంలో జరిగిన ఎన్నికల్లో బలహీనవర్గాలకు 127 టికెట్లు ఇచ్చి సామాజిక సాధికారితను చాటారు. పీవీని విదేశాంగ మంత్రిగా నియమించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఆయన ద్వారానే అన్ని దేశాలతో సుహృద్భావం ఏర్పడింది.

ప్రధానిగా, సీఎంగా నాటి ఏపీపై పీవీ ముద్ర..

ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు అన్ని విధాలా నాటి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమే జరిగింది. అన్ని రకాల మేలు జరిగింది. మాకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరూ చెప్పలేదు.ఆయన దృష్టికి ఏ సమస్య వెళ్లినా పరిష్కరించేవారు.

పీవీకి తగిన గుర్తింపు రాకపోవడానికి కారణం

రాజకీయాలే కారణం. నెహ్రూయేతర కుటుంబం నుంచి ప్రధాని కావడం. ఆయన నిలదొక్కుకోవడం అసూయకు దారి తీసింది. దక్షిణభారత్‌ వారు కావడం కూడా కొంత మందికి నచ్చలేదు.

దేశ, విదేశీ కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉంటుంది

తెలంగాణతో పాటు భారత్‌లోనూ కార్యక్రమాల ప్రణాళిక ఖరారైంది. తెరాసకు 50 దేశాల్లో శాఖలున్నాయి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి విభాగాలు పనిచేస్తున్నాయి. తెలంగాణ సంఘాలున్నాయి. వీటి సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తాం.

ఇతర పార్టీల వారిని కూడా ఆహ్వానిస్తారా

ఇది ప్రభుత్వ కార్యక్రమం. అన్ని పార్టీల వారు పాల్గొనవచ్చు. ప్రముఖులను మొదటి వరుసలో కూర్చోబెడతాం. అందరినీ నేను స్వయంగా ఆహ్వానిస్తా.

పీవీతో మీ అనుబంధం..

పీవీ నాకు గురువు. ఆయనకు నేను విద్యార్థిగా పరిచయమయ్యాను. నేను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం కొనసాగింది. పార్టీలోనూ నన్ను ప్రోత్సహించారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా కలిసి పలు విషయాలపై చర్చించే వాడిని. ఎన్నో రకాలుగా సాయపడ్డారు. నాకు ఎంపీ టికెట్‌ ఇప్పించారు. నేను పీసీసీ అధ్యక్షుడిని అయిన సందర్భంగా.. మొదటి సారి సరైన వ్యక్తిని ఎంపిక చేశారంటూ నా నియామకం గురించి అధిష్ఠానాన్ని పీవీ అభినందించారు. నాకు అనేక సందర్భాల్లో మార్గదర్శకునిగా నిలిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.