ETV Bharat / city

జూబ్లీహిల్స్​లో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - జూబ్లీహిల్స్​లో ఆవిర్భావ వేడుకలు

జూబ్లీహిల్స్​ నియోజకవర్గ పరిధిలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గోపీనాథ్ హాజరై జెండా ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో భాగంగా కార్యకర్తలు ఇంటిపైనే జెండా ఎగురవేయాలని సూచించారు.

trs foundation celebrations in jubleehills
జూబ్లీహిల్స్​లో ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Apr 27, 2020, 2:40 PM IST

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ హాజరై జెండా ఆవిష్కరించి, మిఠాయిలు పంచారు. కార్యకర్తలకు పార్టీ అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు.

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం సూచించిన విధంగాా ప్రతి కార్యకర్త తమ ఇంటిపై జెండా ఎగురవేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇదీ చూడండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.