ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియను విశాఖలో కళా ప్రియులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె గానామృతంతో మంత్రముగ్దుల్ని చేసింది. షణ్ముఖ ప్రియ పాటలు వింటూ చిన్నా, పెద్దా అంతా ఆనందించారు. మేయర్ హరి వెంకటకుమారి, జీసీసీ ఛైర్మన్ స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆమెకు 'విశ్వగాన ప్రియ' అవార్డును ప్రదానం చేశారు.
తల్లిదండ్రుల సహకారం, విశాఖ వాసులు ఆదరాభిమానాల సహకారంతో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరు మామ, అంబటి రామకృష్ణ, ప్రతాప్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
వైజాగ్‌కు మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వారందరూ చాలా ఘనంగా నన్ను ఆహ్వానం పలికారు. విశ్వగాన ప్రియ అనే బిరుదు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. అభిమానుల సపోర్ట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. భవిష్యత్‌లోనూ ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పొజిషన్ కన్నా ప్రేక్షకుల ఆదరాభిమానాలే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.
షణ్ముఖ ప్రియ.
ఇదీచూడండి: తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ.. కోట్ల మనసుల్ని గెలిచింది!