ధరణి పోర్టల్ ప్రారంభించిన రోజును భూ హక్కుల పరిరక్షణ దినం/ రెవెన్యూ డేగా ప్రకటించాలని సీఎంకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతంకుమార్ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే రెండు రకాల సేవలను ఒకే పోర్టల్లో అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని, పటిష్ఠమైన చట్టం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
పోర్టల్ ప్రారంభ కార్యక్రమం అనంతరం సీఎం వారిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి బొటనవేలు చూపి(డన్) మీరు సాధించారు.. అంటూ అభినందించారు. కొత్తచట్టం అమల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని కేసీఆర్ సూచించగా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని వారు హామీ ఇచ్చారు.