రాష్ట్రవ్యాప్తంగా 76 మంది జూనియర్ సివిల్ జడ్జీల బదిలీలు (Transfers of Junior Civil Judges) జరిగాయి. జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు (Telangana high court) ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 12న కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీగా జిల్లా జడ్జీల బదిలీలు జరిగాయి. 45 మందిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మరో 14 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పించి.. పోస్టింగులు ఇచ్చింది.
సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఆర్.తిరుపతి, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జీగా జీవీ సుబ్రమణ్యం, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జీగా ఎ.వీరయ్య నియమితులయ్యారు. సీనియర్ సివిల్ జడ్జీలు పి.రాజు, పి.లక్ష్మీ కుమారి, జి.సునీత రవీంద్రరెడ్డి, సి.పావని, ఎం.శరత్ కుమార్, ఎన్.రోజా రమణి, టి.అనిత, మహ్మద్ అఫ్రొజ్ అఖ్తర్, కె.ఉమాదేవి, బి.అపర్ణదేవి, సీహెచ్.పంచాక్షరి, బి.తిరుపతి, జె.కవిత, టి.సుహాసినిలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ.. హైకోర్టు పోస్టింగులు ఇచ్చింది.
ఇదీ చూడండి: Judges Transfer: రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు