తనను తెరాస కండువా కప్పుకున్నారని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించడాన్ని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు ఖండించారు. తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ పనిచేశానని చెప్పారు. ఏ ప్రభుత్వంలో పనిచేసినా ఏ పార్టీ కండువా వేసుకోలేదని.. వేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వృత్తిపరంగా మాత్రమే పనిచేస్తామని తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. గత ఐదేళ్లలో హైడల్ విద్యుత్ 10,083 మిలియన్ యూనిట్లకు తగ్గిందని వివరించారు.
ఇదీ చూడండి: తుమ్మిడిహట్టికి ఎందుకు.. కాళేశ్వరం వెళ్లండి: కొప్పుల