డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వైపు వెళ్లకుండా... తెలుగుతల్లి పైవంతెన వైపు వెళ్లాలని నగరవాసులకు సూచించారు. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు బషీర్బాగ్ వైపు, బషీర్బాగ్ నుంచి వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్ వైపు మళ్లించనున్నారు.
కట్టమైసమ్మ గుడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు తెలగుతల్లి పైవంతెన మీదుగా మళ్లించనున్నారు. అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ రహదారుల గుండా పోనిస్తారు. జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారి లారీ, ట్రక్కుల పార్కింగ్ కోసం బుద్ద భవన్ వెనుక... కార్లు, ద్విచక్రవాహనాలను నిజాం కాలేజి మైదానంలో పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. ఈ అంక్షలు రేపు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకూ అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.