ETV Bharat / city

REVANTH REDDY: 'సోనియా, రాహుల్​ గాంధీల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' - telangana varthalu

తక్కువ సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎక్కువ పదవులు ఇచ్చిందని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా పని చేస్తానని, మెజారిటీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఇంట్లో పీసీసీ కమిటీ సభ్యులు తేనీటి విందు పేరుతో సమావేశమయ్యారు.

revanth reddy
'సోనియా, రాహుల్​ గాంధీల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా'
author img

By

Published : Jun 29, 2021, 2:20 AM IST

భేషజాలు లేకుండా తాను పని చేస్తానని, నిన్నటి వరకు చూసిన రేవంత్ రెడ్డి వేరని పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఇంట్లో పీసీసీ కమిటీ సభ్యులు తేనీటి విందు పేరుతో సమావేశమయ్యారు. సోనియా, రాహుల్‌ గాంధీలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రికెట్‌ జట్టు మాదిరిగా సమష్ఠిగా పని చేద్దామని సహచర సభ్యులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ కుటుంబమే..

కాంగ్రెస్ చరిత్రలో 4రోజులపాటు అభిప్రాయ సేకరణ చేసి పీసీసీ నియామకం చేయడం ఇదే మొదటి సారని, తాను సోనియా గాంధీ మనిషినని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తమది ముందు నుంచి కాంగ్రెస్ కుటుంబమని, స్థానిక పరిస్థితులు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని పేర్కొన్నారు. మనస్పూర్తిగా కాంగ్రెస్‌లోకి వచ్చానని, తక్కువ సమయంలో పార్టీ ఎక్కువ పదవులు ఇచ్చిందని రేవంత్‌ గుర్తుచేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి కార్యనిర్వాహక అధ్యక్షులు జె.గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేశ్‌కుమార్‌ గౌడ్‌లతోపాటు సీనియర్‌ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌ రెడ్డి, మల్లు రవి, నిరంజన్‌, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ తదితరులు హాజరయ్యారు.

REVANTH REDDY: 'సోనియా, రాహుల్​ గాంధీల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా'

రేవంత్​కు మద్దతుగా..

సమష్ఠిగా పార్టీని ఏలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశమే కమిటీ సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్లు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి వెల్లడించారు. తేనీటి విందు సందర్భంగా అందరి అభిప్రాయాలను తెలుసుకున్న రేవంత్‌ రెడ్డి... తన అభిప్రాయాన్ని కూడా కమిటీ సభ్యులకు స్పష్టం చేసినట్లు ఆయన వివరించారు. సామాజిక న్యాయంతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన సోనియా, రాహుల్‌ గాంధీలకు ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జులై 7వ తేదీన ఉదయం 10 గంటలకు పెద్దమ్మ గుడిలో పూజలు, ఆ తరువాత నాంపల్లిలోని మసీదులో పూజలు చేసిన తరువాత గాంధీభవన్‌లో బాధ్యతలు తీసుకుంటారని వివరించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీభవన్‌ చేరుకుని పీసీసీగా ఛార్జ్‌ తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో రేవంత్‌ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: MP KOMATI REDDY: 'రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.