ETV Bharat / city

Revanth reddy comments: 'శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా' - విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(revanth reddy news) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌లో భాగంగా ఎల్బీనగర్‌ ర్యాలీ(congress rally)కి వెళ్లకుండా రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను రేవంత్​ రెడ్డి(Revanth reddy comments) నిలదీశారు. తన నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకోవటం సరికాదని హెచ్చరించారు. నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాల్సింది పోయి.. అడ్డుకుంటారేంటని ప్రశ్నించారు.

tpcc chief Revanth reddy fire on police while stopping at his home

author img

By

Published : Oct 2, 2021, 5:02 PM IST

Updated : Oct 2, 2021, 5:17 PM IST

'శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా'

ఒక ఎంపీకి నియోజకర్గంలో పర్యటించే హక్కు లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth reddy comments) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌(congress rally)లో పాల్గొనేందుకు వెళ్తుండగా.. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. గృహనిర్బంధం చేయటం పట్ల రేవంత్​ రెడ్డి(revanth reddy news) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులు అధికారులను నిలదీశారు. తనను అడ్డుకోవాలనే ఉత్తర్వులు చూపిస్తే నేను వెనుతిరుగుతానన్నారు. తన ఎంపీ విధులకు భంగం కలిగిస్తున్నందుకు.. పోలీసులు చట్టపరంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎంపీని అడ్డుకుంటారా..?

"నా నియోజకర్గంలో తిరగకుండా చేస్తారా?. నా నియోజకర్గంలో పర్యటించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. గాంధీ జయంతి రోజున ఒక ఎంపీ కార్యక్రమాలను అడ్డుకుంటారా? నా గృహనిర్బంధంపై ఉత్తర్వులు ఉంటే చూపాలి. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించే స్వేచ్ఛ కూడా లేదా?. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా?. నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాలి. శ్రీకాంత్‌చారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు కోపం ఎందుకు?. కేసీఆర్‌ తప్ప.. శ్రీకాంత్‌చారి విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకూడదా?." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎల్బీనగర్‌ ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకోవటం వల్ల ఆయన ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకపోవటంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Oct 2, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.