1. మహా'రాణులు'
హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు తెరాస కైవసం చేసుకుంది. మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కర్తవ్యబోధ..
హైదరాబాద్ భవిష్యత్ మీపైనే ఆధారపడి ఉందని... గొప్పగా పని చేసి నగర వైభవాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. సహజత్వాన్ని కోల్పోకుండా, అబద్ధాలు చెప్పకుండా... సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ నలుగురు దొరికారు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ బీఫార్మసీ యువతి అత్యాచారం కేసులో కీసర పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. యథాతథం..
ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితి నెలకొల్పడమే తమ లక్ష్యమని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. సైన్యం చూపిన తెగువ వల్లే చైనాపై పైచేయి సాధించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 45 మంది జవాన్లు మృతి
తూర్పు లద్దాఖ్‌లో గతేడాది భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై 'డ్రాగన్' పెదవి విప్పలేదు. అయితే.. ఆ ఘర్షణలో 45 మంది చైనా జవాన్లు మృతి చెందారని రష్యా వార్తాసంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అప్పటిదాకా తగ్గలే..
భారత్-చైనా మధ్య తొలిదశ సైనిక బలగాల ఉపసంహరణ.. ఈ నెలాఖరుకల్లా పూర్తికానుంది. ఈ ప్రక్రియ పూర్తయిన 48 గంటల్లో.. ఇరుదేశాల మధ్య కమాండర్ల స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. ఇతర ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఈ భేటీలో దృష్టి సారించనున్నారు. అయితే.. ఆయా ప్రాంతాల్లో చైనా బలగాలు పూర్తిగా వైదొలగినట్లు నిర్ధరించుకున్నాకే.. భారత్ తన బలగాలను వెనక్కి తీసుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. బాబర్ మిస్సైల్..
పాక్.. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల బాబర్ క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించింది. గత మూడు వారాల్లో ఆ దేశంలో ఇది మూడో క్షిపణి పరీక్ష కావడం విశేషం. ఈ ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. రూ.11 కోట్ల కంప్యూటర్
యాపిల్ కంప్యూటర్ను రూ.11 కోట్లకు అమ్ముతానని ప్రకటించాడు ఓ వ్యక్తి. ఒక్క కంప్యూటర్‌కు అంత ధరనా అని ఆశ్చర్యపోతున్నారా? మరి అది మామూలు కంప్యూటర్ కాదు.. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.. స్టీవ్ వొజ్నియాక్ ఆవిష్కరించిన తొలి యాపిల్ 1 కంప్యూటర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అథ్లెట్లకు టీకాలు..!
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అథ్లెట్లకు వచ్చే నెల చివర్లో కరోనా టీకా అందే అవకాశం ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వగానే ఆ ప్రక్రియ మొదలు పెడాతామని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అన్న ఇంటికి వచ్చారు..
ప్రముఖ నటుడు సూర్యకు కరోనా నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోదరుడు కార్తి సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.