ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM - టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9 pm
9 pm
author img

By

Published : Feb 9, 2021, 9:03 PM IST

Updated : Feb 9, 2021, 9:17 PM IST

1. ధన్యవాద సభ

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు... అప్పుడే అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ధన్యవాద సభ పేరిట అధికార తెరాస ఏకంగా... ముఖ్యమంత్రినే రప్పిస్తోంది. సాగర్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే రూ.3 వేల కోట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నికల ప్రకటనకు ముందే పనులు ప్రారంభించబోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. తెలంగాణలో కొత్తపార్టీ..

తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని ఏపీ సీఎం జగన్​ సోదరి వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అన్నారు. విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన కోరిక అని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కాంగ్రెస్ అభ్యర్థులు

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్​ నుంచి రాములు నాయక్​, మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్​ నుంచి చిన్నారెడ్డిని ఎంపిక చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. స్థానిక పోరు

తొలి విడత ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సాక్ష్యమిదే..

తాను శాంతినికేతన్​లోని ఠాగూర్​ కుర్చీలో కూర్చున్నారన్న కాంగ్రెస్​ ఎంపీ అధిర్​ రంజన్​ చౌదరి ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి అమిత్​ షా. పర్యటకుల కోసం కేటాయించిన విండో సీట్​లో కూర్చున్నానని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 7 రోజుల కస్టడీ

ఎర్రకోట ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూకు 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ న్యాయస్థానం. రిపబ్లిక్​ డే రోజు రైతుల నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వెంటనే పునరుద్ధరించండి

గత డిసెంబర్​లో పాకిస్థాన్​లో కొందరు దుండగులు కూల్చిన హిందూ దేవాలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓ గడువును నిర్దేశించుకొని తమకు తెలియజేయాలని ప్రభుత్వానికి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. టీకాలకు ఆర్డర్

మరో 1.45 కోట్ల కొవిడ్​ టీకాలను కేంద్రం కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సరఫరా సంస్థలైన సీరం, భారత్​ బయోటెక్​ వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. నిబంధనలు మార్చారు..

లాక్​డౌన్​లో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టిక రూల్స్​ను మార్చడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమ్ ​ఇండియా సారథి విరాట్​ కోహ్లr. మంగళవారం.. ఇంగ్లాండ్​పై తొలి టెస్టు ఓటమి అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ​పాయింట్ల పట్టికలో భారత్​ నాలుగో స్థానానికి పడిపోయిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు విరాట్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పవన్​ కోసం..

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ - దర్శకుడు క్రిష్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చారిత్రక సినిమాలో చార్మినార్​ వైభవం గురించి చెప్పనున్నారట. దీంతో చార్మినార్​ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ ప్రత్యేకమైన సెట్​ నిర్మించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Feb 9, 2021, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.