ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

author img

By

Published : Jan 31, 2021, 9:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM

1. కేటీఆర్ సీరియస్..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ఒప్పించడం చేతకాక, దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. భాజపా తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అభినందనలు

మన్​ కీ బాత్​లో ప్రధాని నరేంద్ర మోదీ బోయిన్​పల్లి మార్కెట్​ గురించి ప్రస్తావించి అభినందనలు తెలపడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పల్స్ పోలియో..

రాష్ట్రవ్యాప్తంగా 'పల్స్‌ పోలియో' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తొలిచుక్కలు వేసి.. కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో 23 వేలకు పైగా కేంద్రాల్లో... ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కరోనా కారణంగా గతంలో దీనిని వాయిదా వేసిన ప్రభుత్వం... తీవ్రత తగ్గటంతో తిరిగి ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ, వైద్యారోగ్య సిబ్బంది ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించటంతో తొలిదశలో విజయవంతంగా ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఫిబ్రవరి 13 వరకే రాజ్యసభ!

రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న సభా కార్యకలాపాలు కొనసాగుతాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. అదే రోజు సభ కార్యకలాపాలు ముగుస్తాయని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తోమర్ కౌంటర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలపై ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్​లను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తప్పుపట్టారు. మూడు చట్టాల వల్ల రైతులకు కలిగే లాభాలను అనుభవజ్ఞులైన పవార్​ వివరించాలని హితపు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సంస్కరణలు మంచివే

కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ చట్టాలు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఉద్యోగాలు సైతం పెరుగుతాయని చెప్పారు. ఈ మేరకు ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్​కు బ్రిటన్ ఆతిథ్యం

బ్రిటన్​లో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్న అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్​కు బ్రిటన్​ రాణి ఎలిజిబెత్​-2 ఆతిథ్యమివ్వనున్నారు. జూన్​లో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మన కుర్రాళ్ల జోరు

ఆస్ట్రేలియాపై మరపురాని విజయాన్ని అందించిన గెలుపు గుర్రాలు.. ఈ కుర్రాళ్లు. ఒక్క పర్యటనతో హీరోలైన ఈ యువ క్రికెటర్ల గెలుపు వెనకాల అంతులేని కృషి దాగిఉంది. టీమ్​ఇండియాకు చారిత్రక విజాయాన్ని అందించిన సిరాజ్, శార్దుల్, సుందర్, గిల్​, పంత్​ల ఉద్వేగభరిత కథను తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'కొండవీటి రాజా'కు 35 ఏళ్లు

మెగాస్టార్​ చిరంజీవి-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్​లో ఎన్నో సూపర్​హిట్​ చిత్రాలు రూపొందాయి. అందులో 'కొండవీటి రాజా' ఒకటి. 1986 జనవరి 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. నేటితో 35 ఏళ్లు గడిచిన సందర్భంగా 'కొండవీటి రాజా' సినిమాను గుర్తుచేసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సినిమా కబుర్లు

టాలీవుడ్​లో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'చావు కబురు చల్లగా' చిత్రం విడుదల తేదీ సహా 'రెడ్​' ఐటెంసాంగ్​ వీడియో అప్​డేట్స్​ వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.