ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9pm
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Dec 22, 2020, 9:00 PM IST

1. వణుకు..

రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజులు శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాది, ఈశాన్య దిక్కుల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో చలిగాలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఫొటో పెట్టాల్సిందే..

కేంద్ర పథకాల్లో ప్రధాని ఫొటోను ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ కుమార్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని ఫొటో పెట్టకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. ఫొటోలు పెట్టే అంశంలో అధికారుల పాత్ర ఏమిలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. జాగ్రత్తపడుతున్నాం..!

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ వచ్చిన దృష్ట్యా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్‌ తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వారిపట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కొత్తరకం వైరస్‌పై కేంద్రం ఇప్పటికే సూచనలు చేసిందన్న ఆయన ఆ మేరకు అన్ని శాఖలను రాష్ట్రప్రభుత్వం అప్రమత్తం చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కీలక భేటీ..

సాగు చట్టాలపై చర్చించేందుకు రావాలని కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాలు స్పందించాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు బుధవారం అన్ని రైతు సంఘాలు భేటీ కానున్నాయి. ఈ మేరకు రైతు సంఘం నాయకుడు కుల్వంత్​ సింగ్​ సంధు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కొత్త యుగానికి నాంది..

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన సాగు చట్టాలు దేశ వ్యవసాయ రంగంలో కొత్త యుగానికి నాంది అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తెలిపారు. అవి రైతులకు లాభం చేసేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు దఫాలుగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపామని.. మరో విడత చర్చల కోసం ఓ తేదీని ప్రకటించాలని కోరుతూ అన్నదాతలకు లేఖను రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. బంగాల్​ టాప్​..!

అభివృద్ధిలో బంగాల్..​ దేశంలోనే ముందంజలో ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ(టీఎంసీ) పాలనలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, నేరాలు తగ్గాయన్నారు. ఈ మేరకు జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్​సీఆర్​బీ) లెక్కలను మీడియా ముందుకు తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. రక్షించేది అదే..

అమెరికాలో ఉన్న భారతీయ వైద్యుల్లో చాలా మంది కరోనా వ్యాక్సిన్​ను తీసుకుంటున్నారు. అంతేకాక టీకా వేసుకోమని ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని రక్షించేది వ్యాక్సిన్​ మాత్రమేనని వారు సూచిస్తున్నారు. ఫైజర్-బయోఎన్​టెక్, మోడెర్నా టీకాలను గతవారం నుంచి అమెరికాలో ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 108 మెగా పిక్సళ్ల ఫోన్​..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. దేశీయ మార్కెట్లో మరో 108 మెగా పిక్సెళ్ల ఫోన్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. బడ్జెట్​ సెగ్మెంట్​లో తేనున్న మోడల్​ను.. వచ్చే ఏడాది జనవరి 5న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్​పై అంచనాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. థాయ్​లాండ్ వెళ్తా..!

ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్తానని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై అక్కడ నిషేధమేమీ లేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. షాహిద్-విజయ్ వెబ్ సిరీస్..

బాలీవుడ్​లో రాజ్‌-కృష్ణ డీకేల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ వెబ్​సిరీస్​లో విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి నటించనున్నారని తెలిసింది. ఇందులో హీరో షాహిద్​ కపూర్​ కూడా నటిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సిరీస్​కు సంబంధించిన షూటింగ్​ ప్రారంభంకానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.