1. రేపే ఎన్నికలు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 150 డివిజన్లలో... 1,122 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా... 74 లక్షల మందికిపైగా ఓటర్లు... ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కరోనా వ్యాప్తి వేళ... బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భారీ బందోబస్తు
జీహెచ్ఎంసీ పోలింగ్ కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. ఘర్షణలకు తావివ్వకుండా నిఘా నేత్రాలతో పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కాంగ్రెస్ ఫిర్యాదు
బల్దియా ఎన్నికలు పారదర్శకంగా జరిగేట్లు చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నిర్భయంగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఈ-మెయిల్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రెండేళ్లలో ఎన్నికలు
రైతుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పోరాడుతామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా సర్కార్ ఏర్పడి రెండేళ్లు గడిచిపోయిందని... మరో 2 ఏళ్ల లోపే ఎన్నికలు రావొచ్చని అభిప్రాయపడ్డారు. అమరావతిని ముంపు ప్రాంతం అని పదే పదే చెప్పే ప్రభుత్వం.. చివరికి కడపను ముంచేసిందని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మాకు దేశం ముఖ్యం
వారణాసిలో దేవ్ దీపావళి మహోత్సవం ఘనంగా జరిగింది. వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ తొలి దీపాన్ని వెలిగించారు. మొత్తం 15లక్షల దీపాలను ఘాట్లల్లో వెలిగించారు ప్రజలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. స్టాంపుల్లో డ్రగ్స్
బెంగుళూరు పోలీసులు.. గణేశ్ ఫొటో స్టాంపుల్లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో స్టాంపును రూ. 4వేలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. మొత్తం రూ. 15లక్షలు విలువగల మాదకద్రవ్యాలను జప్తు చేసి.. కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఆడియో కట్..
కొంతమంది ఎంపీలు ఛైర్మన్ మైక్రోఫోన్‌ను ధ్వంసం చేయడం వల్లే సాగు చట్టాలు ఆమోదించే చేసే సమయంలో రాజ్యసభ ఆడియో ఫీడ్ నిలిచిపోయిందని సీపీడబ్ల్యూడీ వెల్లడించింది. ఇతర సాంకేతిక కారణాలు లేవని స్పష్టం చేసింది. ఫీడ్‌ను పునరుద్ధరించడానికి అరగంట సమయం పట్టినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. దిల్లీ రెండో స్థానం
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా మరోసారి పాకిస్థాన్‌లోని లాహోర్ నిలిచింది. రెండో స్థానంలో భారత దేశ రాజధాని దిల్లీ ఉంది. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈమేరకు జాబితా రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టీకాకు అభ్యర్థన
తమ సంస్థ అభివృద్ధి చేసిన టీకా 94శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు మోడెర్నా సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో టీకా అత్యవసర వినియోగం కోసం అమెరికా, ఐరోపా సమాఖ్యను అనుమతి కోరనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సెలవులు తీసుకోలేదు..
గతంలో తాను పితృత్వ సెలవులు అడిగితే బోర్డు నిరాకరించిందని వస్తోన్న వార్తలను ఖండించాడు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. అసలు తానెప్పుడు అడగలేదని స్పష్టం చేశాడు. అయితే ఓ సారి తాను న్యూజిలాండ్ పర్యటనలో గాయపడినప్పుడు సెలవు ఇవ్వమని కోరితే ఇవ్వలేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.