1. సామూహిక వ్యవసాయం
పెట్టుబడులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులును కోరారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన గోవిందరాజులుతో పలు అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2 .వాయిదా వేయాల్సిందే..
కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. కొవిడ్ సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పంచాయతీలో పార్టీ..
గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భర్త ... తన అనుచరులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రెండే ఆప్షన్స్
జీఎస్టీ పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాలకు రెండు మార్గాలను ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన పరిహారం రూ.3 లక్షల కోట్లు కాగా.. ఆదాయం పోను రూ.2.35 లక్షల కోట్ల లోటు ఏర్పడుతుందని కేంద్రం తెలిపింది. వీటిని ఆర్బీఐ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సూటు బూటు సర్కార్..!
కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పెద్ద వ్యాపారాలకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. మధ్యతరగతి ప్రజలకు రుణాలపై వడ్డీని మినహాయించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారుగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పాక్ అంతే..
పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ. ఘటనకు ప్రధాన కారకుడైన మసూద్ అజర్ ఇప్పటికీ పాక్‌లోనే ఉండటం విచారకరమని పేర్కొంది. ఉగ్రదాడి ఘటనపై పాక్‌కు ఎన్ని ఆధారాలు ఇచ్చినా.. తన బాధ్యతను మాత్రం విస్మరిస్తూనే ఉందని మండిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఇందుకే కాంగ్రెస్ పతనం
కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేపట్టాలంటూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి సంక్షోభం ఏర్పడడానికి కారణాలపై నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించింది ఈటీవీ భారత్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. స్ఫూర్తిదాయకం
దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ 112వ జయంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు సచిన్ తెందుల్కర్. ప్రతిఆటగాడికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. నన్ను వేధిస్తున్నారు..!
అత్యాచారం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని యాంకర్ ప్రదీప్ అన్నారు. ఇందులో నిజనిజాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రక్షణ కావాలి
తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని హీరోయిన్ రియా చక్రవర్తి చెప్పింది. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా, వారు పట్టించుకోలేదని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.