ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9pm
టాప్​టెన్ న్యూస్ @9PM
author img

By

Published : Aug 26, 2020, 9:00 PM IST

1. పూర్వ విద్యార్థుల నెట్​వర్క్..

విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు తమ పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకునేందుకు కృషి చేయాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సూచించారు. పూర్వ విద్యార్థులతో ఒక సమర్థవంతమైన నెట్​వర్క్​ ఏర్పాటు చేసే దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. సమీక్ష..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీవీ శతజయంతి ఉత్సవాలపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. వ్యవస్థల నిర్వీర్యం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బహిరంగ సభ జరిగింది. దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో బహిరంగ సభలో పాల్గొన్న సీతారాం ఏచూరి.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు వైఖరిపై ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. పరీక్షలు పెంచరా..?

కొవిడ్ కేసులను, మరణాలను ప్రభుత్వం దాస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు పరిశీలించి... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. పెద్దగా నష్టమేం జరగలేదు..

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం వల్ల వేల కోట్ల నష్టం జరగలేదని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​ రావు అన్నారు. రూ.100 కోట్ల లోపే నష్టం జరిగినట్లు అంచనా వేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఉమ్మడిగా పోరాడదాం..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన సమావేశంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నీట్, జేఈఈ నిర్వహణను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. కేంద్రంపై పోరుకు అందరూ ఏకం కావాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కాల్పుల్లో ఒకరు..

అమెరికా విస్కాన్సిన్​లో నల్లజాతీయుడిపై పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరొకరు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఒక్క పరుగుతో..

ఐపీఎల్​ ఆరంభం నుంచి తమ విధ్వంసకర బ్యాటింగ్​తో ఎంతోమంది క్రికెటర్లు గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 56 శతకాలు నమోదు కాగా.. ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్​ అయిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. 99 పరుగుల వద్ద వెనుదిరిగిన, నాటౌట్​గా నిలిచిన స్టార్​ బ్యాట్స్​మెన్లు ఎవరో తెలుసుకుందామా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. కంగ్రాట్స్.. ఈటీవీ

ఆగస్టు 27 నాటికి పాతిక వసంతాలు పూర్తి చేసుకోనున్న ఈటీవీకి.. టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​బాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఫలిస్తున్నాయ్..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజాగా బులెటిన్​ విడుదల చేసింది చెన్నై ఎంజీఎం ఆస్పత్రి. ఐసీయూలో వెంటిలేటర్​, ఎక్మో సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్పీ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.