ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9PM
టాప్​టెన్ న్యూస్ @9PM
author img

By

Published : Nov 15, 2020, 6:59 PM IST

Updated : Nov 15, 2020, 9:28 PM IST

1. నిద్రపోను..

కొవిడ్ సమయంలో ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల పాటు కోత విధించిన 50 శాతం జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్​లో బస్సుసర్వీసులను 50 శాతానికి పెంచాలన్న సీఎం... ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు. ఆర్టీసీని బతికించుకొని తిరిగి గాడిన పెట్టే వరకు నిద్రపోనన్న కేసీఆర్... తాను ఉన్నంత కాలం సంస్థను బతికించుకుంటానని ఉద్ఘాటించారు. కార్గో సేవలను ప్రజలు బాగా ఆదరించటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పర్యవేక్షక కమిటీ

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలపై భాజపా ప్రత్యేక దృష్టిసారించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జాతీయ నాయకులతో కమిటీ వేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బల్దియా పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ప్రత్యేక విభాగం

జీహెచ్​ఎంసీలో వరదలు పాలకుల కళ్లు తెరిపించాయి. దీంతో హైదరాబాద్​ చెరువులకు మహర్దశ వచ్చింది. నగరానికి బాహ్యవలయ రహదారి లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ఏడాది భారీ వర్షాలకు పెద్దఎత్తున కాలనీలు ముంపు గురి కావడంతో చెరువుల సంరక్షణ, నిర్వహణపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మందు పంపిణీ..

హీరోలు, నాయకుల పుట్టిన రోజులకు అభిమానులు... అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంచడం చాలా సాధారణమైన విషయం. తన అభిమాన వ్యక్తి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడో... వార్తల్లో నిలవాలనుకున్నాడో... ఈ వీరాభిమాని మాత్రం తనకు ఇష్టమైన వ్యక్తి పెళ్లిరోజున... అన్నింటికీ భిన్నంగా... మరీ వినూత్నంగా... మద్యం పంచాడు. ఫ్రీగా కాందండోయ్​... రూపాయికి ఓ క్వార్టర్​ చొప్పున పంచాడు. అసలు ఆ వీరాభిమాని ఎవరో మీరే చూడండి... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ముగ్గురు మృతి

నిజామాబాద్ జిల్లా అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కరోనా తగ్గుముఖం

భారత్​లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఎనిమిదో రోజూ 50వేలలోపు కొత్త కేసులు నమోదవుతుండగా.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్త రికవరీ రేటు 93శాతంపైగా నమోదవగా.. మరణాలు రేటు 1.47శాతానికి పడిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఉన్నత స్థాయి సమీక్ష

దిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న క్రమంలో తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్​, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి హర్షవర్ధన్​, దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. 750 ఐసీయూ పడకల ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు చెప్పారు కేజ్రీవాల్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'గిల్గిత్​-బాల్టిస్థాన్​' ఎన్నికలు

గిల్గిత్​-బాల్టిస్థాన్​ మూడో శాసనసభ ఎన్నికలు అదివారం జరిగాయి. కొవిడ్​ నిబంధనల మధ్య కట్టుదిట్టంగా పోలింగ్​ జరిగింది. అయితే.. భారత భూభాగమైన పాక్​ ఆక్రమిత కశ్మీర్​పై పాక్​ చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది భారత్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కల నిజమైన వేళ

ఐపీఎల్​లో హైదరాబాద్​ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసి.. ఆస్ట్రేలియా పర్యటనలో చోటు సంపాదించుకున్నాడు యార్కర్​ స్పెషలిస్ట్​ టి. నటరాజన్​. ఆస్ట్రేలియాలో టీమ్​ఇండియాతో కలిసి తొలిసారి ప్రాక్టీస్​లో పాల్గొన్నాడు అతడు. ఈ నేపథ్యంలో నెట్స్​లో బౌలింగ్​ చేస్తున్న నటరాజన్​ వీడియోను పంచుకుంది బీసీసీఐ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. యంగ్ హీరోతో బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి యువకథానాయకుడితో కలిసి నటించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహితుడైన ఓ ప్రముఖ నిర్మాత తీసుకొచ్చిన కథకు బాలయ్య గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Nov 15, 2020, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.