1. సీఎం నివాళి..
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మహనీయుని సేవలను గుర్తుచేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దిశా నిర్దేశం..
కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో... పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులుగా రానున్న ఐదేళ్ల పాటు ప్రజలతో ఎలా మెలగాలో దిశానిర్దేశం చేస్తున్నారు. మేయర్ ఎంపికపై అవలంభించాల్సిన వైఖరిపై సమావేశంలో చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భారీ బదిలీలు..
రవాణా శాఖలో భారీగా బదిలీలు చోటుచేసుకున్నాయి. అన్ని జిల్లాల్లో ఆర్టీవో అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బ్యాంకుల మద్దతు
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా పలు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రైతులకు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ నెల 8న చేపట్టనున్న భారత్ బంద్‌లో బ్యాంకులు పని చేస్తాయా లేదా అన్నది సందేహంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పాక్-చైనా కుట్రలు
సీపెక్ రక్షణ, గస్తీ కోసం దాదాపు 25వేల మంది సైనికులను మోహరించేందుకు పాకిస్థాన్-చైనా సిద్ధపడుతున్నాయి. వీరికి భారీ స్థాయిలో ఆయుధాలను కూడా సమకూర్చనున్నాయి. భారత్‌ను దృష్టిలో పెట్టుకునే ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అమెరికాలో మద్దతు..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అమెరికాలోని భారతీయ సిక్కులు మద్దతు పలికారు. శాంతియుతంగా అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. బ్లూ షిప్ ఆనవాళ్లు
అత్యంత అరుదైన నీలి గొర్రెల ఆనవాళ్లను హిమాలయాల్లో గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ కుల్లూలో 5000 అడుగుల ఎత్తులో పాదముద్రలను కనిపెట్టిన అటవీ అధికారులు వాటి జాడపై అధ్యయనం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బిట్ కాయిన్ కథేంటి..?
బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతోంది. ఈ వారమే దీని విలువ జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. పదేళ్ల కాలానికి బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్‌గా నిలిచింది. మరి ఇలాంటి కామధేను లాంటి క్రిప్టోకరెన్సీపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కరోనా దెబ్బకు రద్దు..
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరగాల్సిన తొలి వన్డేకు ఆటంకం ఎదురైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉండే హోటల్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల మ్యాచ్‌ను ఆపేశారని ఐసీసీ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అందుకేనట..
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావత్' సినిమాలో నటించమని ప్రభాస్‌ను కోరారు. అయితే.. అప్పటికే 'బాహుబలి'తో మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ అభిమానుల అంచనాల దృష్ట్యా ఈ సినిమాలో నటించనని నిర్మోహమాటంగా చెప్పేశారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.